మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్‌

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్‌
x
Highlights

రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగి అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఆళ్ల...

రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగి అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వారకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అమరావతిలో రాజధాని కోసం ఆందోళన చేషున్నారు రైతులు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో ఎమ్మెల్యే ర్యాలీని అడ్డుకున్నారు.

ర్యాలీ కి అనుమతి లేదని పోలీసులు ఆర్కేను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని బస్సులో తరలించారు. దీంతో ఎమ్మెల్యే ఆళ్లను విడుదల చేయాలని కోరుతూ వైసీపీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా మంగళగిరి ప్రాంతం ప్రస్తుతం అమరావతి రాజధాని పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గం లోని పది గ్రామాల ప్రజలు రాజధానికి ల్యాండ్ పూలింగ్ లో భూమిని ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories