దీప్తిశ్రీ కిడ్నాప్ లో కేసులో విషాదం

దీప్తిశ్రీ కిడ్నాప్ లో కేసులో విషాదం
x
Highlights

చిన్నారి దీప్తీశ్రీ మిస్సింగ్‌ కేసు విషాదంగా మారింది. మూడ్రోజుల క్రితం పాఠశాల నుంచి కనిపించకుండాపోయిన దీప్తిశ్రీ శవమై కనిపించింది. ఇంద్రపాలెం బ్రిడ్జి...

చిన్నారి దీప్తీశ్రీ మిస్సింగ్‌ కేసు విషాదంగా మారింది. మూడ్రోజుల క్రితం పాఠశాల నుంచి కనిపించకుండాపోయిన దీప్తిశ్రీ శవమై కనిపించింది. ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహాన్ని గుర్తించారు. సవతి తల్లే దీప్తిని చంపి మూటలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు విచారణలో తేలింది. దీంతో చిన్నారి మృతదేహం కోసం నిన్నటి నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. చివరికి ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలో దీప్తిశ్రీ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.

చిన్నారి దీప్తిశ్రీ ఈనెల 22 మధ్యాహ్నం కిడ్నాపైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దీప్తిశ్రీ కోసం మూడు రోజుల పాటు గాలించారు. సవతితల్లి శాంత కుమారియే, దీప్తిశ్రీని కిడ్నాప్ చేసి చంపేసిందని పోలీసులు తేల్చారు. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా దీప్తి మృతదేహం కోసం గాలించారు. రెండ్రోజులుగా చిన్నారి ఆచూకి కోసం గాలించిన ధర్మాడి సత్యం బృందం ఇంద్రపాలెం దగ్గర డెడ్‌బాడిని వెలికితీశారు.

కాకినాడ -యానాం రోడ్డులో పగడాల పేటకు చెందిన శ్యామ్‌కుమార్‌ భార్య సత్యవేణి మూడేళ్ల క్రితం చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన శాంతకుమారిని పెళ్లి చేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరగ్గా, ఏడాది క్రితం బాబు పుట్టాడు. అప్పటివరకు దీప్తిని బాగానే చూసుకున్న శాంతకుమారి తనకు బాబు పుట్టుడంతో ఒక్కసారిగా మారిపోయింది. దీప్తిని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించింది. చేతులపైనా, కాళ్లపైనా వాతలు పెడుతూ హింసించడం మొదలుపెట్టింది. దీంతో అది చూసి తట్టుకోలేక బాలిక నానమ్మ దీప్తిశ్రీని తన దగ్గరకు తీసుకెళ్లింది.

దీప్తి పోషణ కోసం తండ్రి, నెలకు 2వేలు ఇవ్వడం నచ్చని సవతి తల్లి శాంతకుమారి, చిన్నారి చంపేందుకు ప్లాన్‌ చేసింది. మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన దీప్తిశ్రీ మధ్యాహ్నం నుంచి కనిపించుకుండా పోయింది. స్కూల్ దగ్గర బాలిక గురించి ఆరా తీసిన తండ్రి శ్యామ్‌కుమార్ కూతురు కిడ్నాపైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.

దీప్తిశ్రీ కనిపించకుండా పోయిన స్కూల్ సమీపంలోని సీసీ కెమెరాల్లో చిన్నారిని మొహానికి ముసుగు కట్టుకొని కనిపించింది. ఆమె చిన్నారిని తన వెంట తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇటు భర్త కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు సవతి తల్లి శాంతకుమారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నించారు. దీంతో ఆమె చేసిన తప్పును ఒప్పుకుంది. తానే దీప్తీశ్రీని చంపినట్లు చెప్పింది. దీప్తిని స్కూల్ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లి మెడకు టవల్ బిగించి హత్య చేశానని దీంతో దీప్తీశ్రీ చనిపోయిందని చెప్పింది. ఎవరికి తెలియకుండా, దీప్తి డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టేసి, సంజయ్‌నగర్‌ నుంచి బైక్‌పై వెళ్లి, ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు ఉన్న ఉప్పుటేరులో పడవేసినట్లు చెప్పింది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories