సినీనటుడు రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం

సినీనటుడు రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం
x
Highlights

సినీనటుడు రాజశేఖర్ కు ప్రమాదం తప్పింది.. శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు...

సినీనటుడు రాజశేఖర్ కు ప్రమాదం తప్పింది.. శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నటుడు రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీసీఎం జగన్ తో బుధవారం రాజశేఖర్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి.

జగన్ నిర్ణయానికి రాజశేఖర్ మద్దతు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు రాజశేఖర్.. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైందే. ఈ పోటీ ప్రపంచంలో పేదవాళ్ళు ఉద్యోగాలు పొందాలన్నా, ఇతరులతో సంభాషించాలన్నా ఇంగ్లిష్ బాష అతిముఖ్యమైనది. ఇంగ్లిషు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలు తెచ్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు' అని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories