తెలంగాణకు రూ.982 కోట్లు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రూ.1892.64కోట్లు

తెలంగాణకు రూ.982 కోట్లు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రూ.1892.64కోట్లు
x
Ministry of finance
Highlights

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ నెల‌ పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాట‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని...

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ నెల‌ పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాట‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు క‌లిపి 46వేల కోట్లు రూపాల‌యల నిధులు విడుద‌ల చేసింది. ఈమేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ విడుద‌ల ప్ర‌క‌ట‌న చేసింది. ఆయా రాష్ట్రాల‌కు ఇచ్చిన నిధుల స‌మాచారాన్ని ట్విట‌ర్ ఖాతాలో పేర్కొంది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఏపీకి రూ.1892.64కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది.

అత్యధికంగా యూపీకు 8255.19కోట్లు రూపాయ‌లు నిధులు ఇవ్వ‌గా.. అత్యల్పంగా గోవాకు 177.72 కోట్ల రూపాల‌య నిధులు విడుదల చేసింది. బిహార్ 4631 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయ‌గా.. మ‌ద్య‌ప్ర‌దేశ్ 3630 కోట్ల నిధులు, మ‌హరాష్ట 2824 కోట్లు విడుద‌ల చేసింది. అన్ని రాష్ట్రాల నిధులు ఈ కింది ప‌ట్టిలో మీకోసం.



Show Full Article
Print Article
Next Story
More Stories