ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా
x
Highlights

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ...

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు తాను రాజీనామా చేస్తునట్టు వెల్లడించారు. గతంలో కూడా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా 2004, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అలాగే 2012 లో వచ్చిన ఉపఎన్నికల్లో కూడా సోమిరెడ్డి ఓటమి చెందారు. ఎమ్మెల్యేగా ఓడినప్పటికి ఎమ్మెల్సీ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories