చంద్రబాబు హత్యా రాజకీయాలు చేసి ఎదిగారు : మంత్రి పేర్నినాని

X
Highlights
* టీడీపీ హయాంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించిన చంద్రబాబు : పేర్ని నాని * ఆ ప్రభావంతోనే ప్రొద్దుటూరు సుబ్బయ్యను పొట్టునపెట్టుకున్న టీడీపీ : మంత్రి పేర్నినాని
Sandeep Eggoju30 Dec 2020 8:04 AM GMT
ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌పై మంత్రి పేర్నినాని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని, ఆయన కొడుకు హత్యారాజకీయాలపై ట్వీట్‌లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రొత్సహించి ఇప్పుడు ప్రొద్దుటూరు సుబ్బయ్యను పొట్టున పెట్టుకున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు. తండ్రిని హత్య చేసినా ఫ్యాక్షన్‌ను జోలికి వెళ్లని చరిత్ర వైఎస్సార్ కుటుంబానిదని మంత్రి పెర్ని నని చెప్పుకచ్చారు.
Web TitleMinister perni nani sensational comments on Chandrababu naidu
Next Story