ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
x
Highlights

ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలుశిక్ష విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది....

ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలుశిక్ష విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పదే పది రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేస్తామన్న మంత్రి పేర్ని నాని ప్రతి రోజూ రెండు లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇసుకను నిల్వచేసినా, అక్రమ రవాణా చేసినా నేరమేనన్న పేర్ని నాని ఎవరైనా ఇసుక అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష పడుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమల్లోకి వస్తుందన్న పేర్ని నాని ఆంధ్రా విద్యార్ధులు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇక, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మొక్కజొన్న ధరల పతనంపై మంత్రివర్గంలో చర్చించామన్న పేర్ని నాని రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రకటించారు. ఇప్పటికే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో మార్కెటింగ్ శాఖ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories