బాబు... మరోసారి యూటర్న్ తీసుకున్నారు : పేర్ని నాని

బాబు... మరోసారి యూటర్న్ తీసుకున్నారు : పేర్ని నాని
x
పేర్ని నాని
Highlights

యూటర్న్ చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు ఇప్పుడు తామే...

యూటర్న్ చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు ఇప్పుడు తామే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్‌ దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌ కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు.

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక మతం పేరుతో చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే బీజేపీ, శివసేన, ఎంఐఎం బెటర్ అన్నారు.

బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. సుజనాచౌదరి చంద్రబాబు ఏజెంటన్న పేర్ని నాని ఇది బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే కాల్‌ డేటాను మీడియాకు ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories