ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని
x
Highlights

మంత్రి అయినా ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణించి పలువురికి ఆదర్శంగా నిలిచిన పేర్ని నాని.. తాజాగా మరోసారి ప్రజలు తనను మెచ్చుకునే పని చేశారు. శనివారం ప్రకాశం...

మంత్రి అయినా ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణించి పలువురికి ఆదర్శంగా నిలిచిన పేర్ని నాని.. తాజాగా మరోసారి ప్రజలు తనను మెచ్చుకునే పని చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్‌ చేశారు. స్వయంగా మంత్రే ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అంతకుముందు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా మచిలీపట్టణం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయినా నాని జగన్ కేబినెట్ లో రవాణా, సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories