ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ‌్యలు

X
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైల్ ఫోటో
Highlights
*కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు పెద్దిరెడ్డి హెచ్చరిక *ఎస్‌ఈసీ తప్పుడు నిర్ణయాలను అమలుచేస్తే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని వార్నింగ్ *మార్చి 31 తర్వాత ఆ అధికారులకు తగిన గుణపాఠం చెబుతాం: పెద్దిరెడ్డి
Samba Siva Rao5 Feb 2021 1:15 PM GMT
ఏపీ పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఈసీ తప్పుడు నిర్ణయాలను ఏకపక్షంగా అమలుచేస్తే బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ హెచ్చరించారు. ఎస్‌ఈసీ మాటలు విని ఏకపక్షంగా ముందుకెళ్లే అధికారులపై చర్యలు తప్పవన్న పెద్దిరెడ్డి.... తాము అధికారంలో ఉన్నంతకాలం బ్లాక్ లిస్ట్‌లో పెడతామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు రూల్స్ ప్రకారం న్యాయంగా పనిచేయాలని... ఒకవేళ, ఏ అధికారైనా రూల్స్ ఉల్లంఘించి ఎస్ఈసీ చెప్పినట్లు నడుచుకుంటే.... మార్చి 31 తర్వాత ఆ అధికారులందరికీ తగిన గుణపాఠం చెబుతామన్నారు పెద్దిరెడ్డి.
Web TitleMinister Peddireddy Ramachandra Reddy Sensational Comments On Govt Officers
Next Story