అందులో రూ. 5 కోట్లు మిగిలింది : మంత్రి అనిల్

అందులో రూ. 5 కోట్లు మిగిలింది : మంత్రి అనిల్
x
Highlights

నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్...

నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు పొందటానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులపై రివర్స్ టెండర్లకు వెళుతోందని టీడీపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన మంత్రి రివర్స్ టెండర్ ప్రక్రియకు సంబంధించి కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికారులు ఏ క్రాంట్రాక్టర్ ను అయినా బెదిరించారా? లేక వారిని అనర్హుల జాబితాలో చేర్చారా? రివర్స్ టెండర్లలో అధిక ధరలకు కోట్ చేశారా ? అని మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ఎందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.

తమ ప్రభుత్వం రివర్స్ టెండర్ ద్వారా తక్కువకె ఆహ్వానిస్తున్నాము.. తద్వారా ప్రభుత్వం ప్రజల డబ్బును ఆదా చేస్తుందని అన్నారు. ఇటీవల కావలిలో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామన్నారు. అయితే ఇందులో కూడా 26 శాతం తక్కువకు కోట్ చేసినట్టు చెప్పారు. ఇంతకు ముందు 2 పిసి అధికంగా కేటాయించారన్నారు. రూ .80 కోట్లకు సిఇపి పనులను ఆహ్వానించబోతున్నామని, టిడిపి ప్రభుత్వం 360 కోట్ల రూపాయల పనులను పిలిచినప్పుడు అదనపు మొత్తంలో కోట్ చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం రూ .19 కోట్లకు ఓ అండ్ ఎం పనులను ఆహ్వానిస్తే రూ .14 కోట్లకు టెండర్లు ఖరారు చేశామన్నారు. ప్రభుత్వానికి రూ. 5 కోట్లు ఆదా చేశామని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

నిత్యం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక నెల్లూరు నగరంలోని వివిధ ప్రదేశాలలో మూడు ఫ్లైఓవర్లను ప్లాన్ చేస్తున్నామని.. అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు ఆయన చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాలను ఆయన ఆదివారం సందర్శించి ప్రజలతో మాట్లాడారు. కాలువ కట్టలపై నివసించే ప్రజలను వెంటనే తరలించలేమని.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21 నుంచి మొక్కలు నాటాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories