స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి : మంత్రి అవంతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి : మంత్రి అవంతి
x
Highlights

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్.. శనివారం విశాఖలో పార్టీ...

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్.. శనివారం విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోశ్యం చెప్పారు. అంతేకాదు ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండటం దేశంలో ఇదే మొదటిది.. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టీడీపీ పాలనలో గత ఐదేళ్లలో కనిపించని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని విస్తరించడానికి మరిన్ని జిల్లాలను ఏర్పాటు తోపాటు 'మూడు రాజధానులు' ఏర్పాటు చేస్తామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల సుదీర్ఘ కాలంలో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని, అన్ని జిల్లాలను ఏకరీతిగా అభివృద్ధి చేస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా పార్టీ మహిళా విభాగం నాయకురాలు గరికిన గౌరీ శారీరక వికలాంగులకు వీల్‌చైర్లు, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విఎంఆర్‌డిఎ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస రావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి తదితరులు సీఎం పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి పార్టీ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories