రాష్ట్రంపై మూడు సౌదీ సంస్థల ఆసక్తి : మంత్రి గౌతంరెడ్డి

రాష్ట్రంపై మూడు సౌదీ సంస్థల ఆసక్తి : మంత్రి గౌతంరెడ్డి
x
Highlights

గత ప్రభుత్వంలో రూ. 5 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగితే కనీసం అందులో 10 శాతం కూడా పెట్టుబడులు రాలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖా మంత్రి...

గత ప్రభుత్వంలో రూ. 5 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగితే కనీసం అందులో 10 శాతం కూడా పెట్టుబడులు రాలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మక 'అమ్మఒడి' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు మంత్రి గౌతంరెడ్డి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. సౌదీ కి చెందిన మూడు అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. త్వరలో నూతన పారిశ్రామిక పాలసీని ప్రకటిస్తామని దానితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ-చెన్నై కారిడార్‌ పనులు వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం విశాఖలో అదానీ గ్రూపునకు అడగక పోయినా 400 ఎకరాలు కట్టబెట్టిందని.. 80-85 ఎకరాలు సరిపోయే పరిశ్రమకు అంత భూమి కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో చంద్రాబాబుకే తెలియాలని అన్నారు. పైగా ఆ భూమి కోర్టు కేసుల్లో చిక్కుకుందని అన్నారు. ఈ కారణంతోనే అదానీ గూప్రు ప్రాజెక్టు పెండింగులో ఉందని ఆయన అన్నారు. అంతేకాదు భూములకు ఒకే చోట ఒక్కో సంస్థకు ఒక్కో రకంగా ధర నిర్ణయించారన్న మంత్రి.. లులూ సంస్థకు షాప్పింగ్ మాల్స్, సినిమా హాళ్ళకోసం విలువైన భుముని కట్టబెట్టారని అందుచేతనే తాము అధికారంలోకి రాగానే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని దాంతో ఆ సంస్థ వెనక్కి వెళ్లిందని చెప్పారు. రాష్ట్రంలో ఏడు నెలల కాలంలో జీడీపీ వృద్ధిరేటు మెరుగుపడిందని మంత్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories