టీడీపీని నాశనం చేయడానికి ఆ ఇద్దరు చాలు- కోడాలి నాని

టీడీపీని నాశనం చేయడానికి ఆ ఇద్దరు చాలు- కోడాలి నాని
x

కోడలి నాని ఫైల్ ఫోటో 

Highlights

తెలుగుదేశం పార్టీని భూ స్థాపితం చేయగలిగే వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారని మంత్రి కొడాని నాలి అన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు చంద్రబాబు...

తెలుగుదేశం పార్టీని భూ స్థాపితం చేయగలిగే వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారని మంత్రి కొడాని నాలి అన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు చంద్రబాబు నాయుడైతే..రెండో వ్యక్తి లోకేశ్‌ నాయుడని నాని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన ఆ పార్టీని నాశనం చేయడానికి వీరిద్దరూ చాలని నాని అన్నారు. ఎన్టీఆర్‌ చావుకు కారణమైన చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సిన అవసరం ఉందని మంత్రి కొడాలి ఎన్టీఆర్‌ అభిమానులకు పిలుపునిచ్చారు. ఓట్ల కోసం, పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబని నాని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఆయనని పొగడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌ మహానుభావుడని..ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. ఆయన మహానుభావుడే అయితే ఆయనను పార్టీలోంచి వెళ్లగొట్టి ముఖ్యమంత్రి పదవి ఎలా చేపట్టావని ప్రశ్నించారు.

ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్‌ మాట నిలబట్టుకోవడానికే పరితపిస్తున్నారని నాని చెప్పారు. ప్రభుత్వం​ ఇచ్చే ఇంటి పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. రాష్ట్రంలో జేబుదోంగ, వెన్నుపోటుదారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు ఉన్నది చంద్రబాబుకే అని, ఆయన మరణానికి కారకులైన దుర్మర్గుడే చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories