బాబుది ఒక ఫేక్ పార్టీ, ఆయనో ఫేక్ నాయకుడు : కొడాలి నాని

X
Highlights
ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామన్నది కాదు.. ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమన్నారు మంత్రి పేర్ని నాని. 22 ఏళ్లు అధికారంలో ఉన్నామన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి నాని తప్పుబట్టారు.
admin17 Dec 2020 4:00 PM GMT
ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామన్నది కాదు.. ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమన్నారు మంత్రి పేర్ని నాని. 22 ఏళ్లు అధికారంలో ఉన్నామన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి నాని తప్పుబట్టారు. చంద్రబాబు దొంగ సర్టిఫికెట్లు మాకు అక్కర్లేదు అన్న మంత్రి నాని.. లోకేష్ కోసమే బాబు ఆరాటమంతా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదని మండిపడ్డ పేర్ని నాని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుల్లో ఎందుకు స్టేలు తెచ్చుకున్నారంటూ ప్రశ్నించారు. అటు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సైతం నిప్పులు చెరిగారు. తన మాటలతో చెడుగుడు ఆడుకున్నారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని, అందుకే, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఒక ఫేక్ నాయకుడని, ఆయనదొక ఫేక్ పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Web TitleMinister Kodali Nani Comments on Chandrababu Naidu
Next Story