Andhra Pradesh:ఎడ్ల పందాలు ప్రారంభించిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రాపాక

Andhra Pradesh:ఎడ్ల పందాలు ప్రారంభించిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రాపాక
x
Highlights

కృష్ణా జిల్లా గుడివాడలో మూడు రోజుల ముందే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సందర్బంగా గుడివాడలో ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు ప్రారంభం అయ్యాయి.

కృష్ణా జిల్లా గుడివాడలో మూడు రోజుల ముందే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సందర్బంగా గుడివాడలో ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఎడ్ల పందేల కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రారంభించారు. గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు రాపాక వరప్రసాద్. రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఇదిలావుంటే ఎమ్మెల్యే రాపాకపై జనసేన పార్టీ ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. ఇవాళ జరుగుతోన్న జనసేన విస్తృత స్థాయి సమావేశానికి కూడా రాపాక హాజరు కాలేదని తెలుస్తోంది.

పలుమార్లు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఇంగ్లీష్ విద్య తోపాటు మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే ఈ రెండు అంశాల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధినేతకు బిన్నంగా రాపాక మాట్లాడుతుండటంతో జనసైనికులకు కోపం నషాళానికి అంటుకుంటోంది. ఆయనను సస్పెండ్ చేయాలనీ కూడా డిమాండ్ చేస్తున్నారు. జనసేన కూడా ఎమ్మెల్యే రాపాకకు శాకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకుంది.. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది.

మరోవైపు రాజోలు వైసీపీలో.. రాపాక కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి దగ్గరవుతున్నారని.. త్వరలో చేరుతారని ప్రచారం జరుగుతోన్న తరుణంలో రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ బొంతు రాజేశ్వరావు వర్గీయులు సమావేశం అవుతున్నారు. ఆరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి బొంతు రాజేశ్వరావు ఎంతో కృషి చేశారని.. ఇప్పుడు రాపాకను తీసుకువస్తే తమ పరిస్థితి ఏంటని వారు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఇంచార్జి బొంతు రాజేశ్వరరావును కాదని ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీకి నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కూడా వారు నిరసన తెలియజేస్తున్నారు. త్వరలోనే బొంతు వర్గం అధిష్టానం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా అమ్మాజీ కి రాజోలు వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories