Kannababu: పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కన్నబాబు సెటైర్లు

*ఫోటోలు, వీడియోల కోసం పవన్‌ శ్రమదానం చేశారు - కన్నబాబు *రెండు గోతులు పూడ్చితే సమస్య తీరదు - కన్నబాబు

Shilpa
Published on: 2 Oct 2021 7:59 PM IST
Minister Kannababu Satires on Pawan Kalyan
X

Kannababu: పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కన్నబాబు సెటైర్లు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Kannababu: ఫోటోలు, వీడియోల కోసం పవన్ శ్రమదానం చేశారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పవన్‌ పూడ్చే రెండు గోతుల వల్ల రోడ్లపై గోతులు మొత్తం పోతాయా అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మత్తుల ఆందోళన పేరుతో పవన్ చీఫ్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు మంత్రి కన్నబాబు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని విమర్శించిన పవన్‌ మాటలను ఖండిస్తు వైసీపీ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గ భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నించారు. అలాగే జగన్‌ సీఎం అయితే రాజకీయాలు వదిలేస్తానని అన్న పవన్‌ కళ్యాణ్ మాటలను ఈ సందర్భంగా కన్నబాబు గుర్తుచేసారు.

Shilpa

Shilpa

Next Story