వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని...

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణ నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని సుబ్బారెడ్డిని కోరారు. తెలంగాణ నుంచి రోజూ వందలాది మంది భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం వస్తుంటారని, అందువల్ల తెలంగాణకు చెందిన భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.

మంత్రి అభ్యర్ధనను సావధానంగా విన్న సుబ్బారెడ్డి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. కాగా ఇప్పటికే బ్రేక్ దర్శనాలు.. ఎల్1, ఎల్2, ఎల్3 వ్యవస్థను రద్దు చేసింది టీటీడీ. తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతించటం సాధారణ భక్తుల హక్కులను హరించటమేనంటూ గతంలో హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తెలంగాణ విన్నపాన్ని ఎలా పరిశీలిస్తారన్న ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories