రాయలసీమలో హైకోర్టు అంశంపై బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు

రాయలసీమలో హైకోర్టు అంశంపై బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

రాయలసీమలో హైకోర్టు అంశంపై బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు

రాయలసీమలో హైకోర్టు విషయమై మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలనీ తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు మంత్రి. ఇటు రుణమాఫీ రద్దు అంశంపై కూడా మాట్లాడిన బుగ్గన గత ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని రూ.22 వేల కోట్లకు కుదించి చివరకు రూ.14 వేల కోట్లే ఇచ్చిందని.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ సంపూర్ణ రుణమాఫీ చేశామని చెప్పారా లేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికీ కొన్ని ప్రాధమ్యాలు ఉన్నాయన్న బుగ్గన రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. కాగా వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని బుగ్గన భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories