Top
logo

చిరంజీవిని సీఎం జగన్ లంచ్ కు పిలిచారు : మంత్రి బొత్స

చిరంజీవిని సీఎం జగన్ లంచ్ కు పిలిచారు : మంత్రి బొత్స
X
Highlights

చిరంజీవిని సీఎం జగన్ లంచ్ కు పిలిచారు : మంత్రి బొత్స చిరంజీవిని సీఎం జగన్ లంచ్ కు పిలిచారు : మంత్రి బొత్స

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చిరంజీవి సినిమా పరంగానే ముఖ్యమంత్రిని కలుస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కోణాలు లేవని చెప్పారు. చిరంజీవిని లంచ్ కు రావాల్సిందిగా సీఎం జగన్ ఆహ్వానించారని బొత్స తెలిపారు. వాస్తవానికి సీఎం జగన్ తో చిరంజీవి భేటీ శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే సీఎం కార్యాలయం చిరంజీవికి ఈ నెల 14న అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. సైరా మూవీని వీక్షించాల్సిందిగా చిరు సీఎం జగన్ ను కోరనున్నారు. రామ్ చరణ్ కూడా సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సైరా చిత్రం విజయం సాధించడంతో చిరంజీవి సంతోషంలో ఉన్నారు. సినిమాకు భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి.

Next Story