వైసీపీలోకి పురందేశ్వరి వస్తే గౌరవిస్తాం: మంత్రి బాలినేని

వైసీపీలోకి పురందేశ్వరి వస్తే గౌరవిస్తాం: మంత్రి బాలినేని
x
Highlights

కొంతకాలంగా పర్చూరు వైసీపీలో ఏమి జరుగుతోందో అర్ధం కాక క్యాడర్ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు

కొంతకాలంగా పర్చూరు వైసీపీలో ఏమి జరుగుతోందో అర్ధం కాక క్యాడర్ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనను ఇంఛార్జిగా తప్పించి రావి రామనాధంబాబు లేదా గొట్టిపాటి భరత్ లలో ఎవరో ఒకరిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి అనుచరులు శుక్రవారం.. మంత్రి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా దగ్గుబాటినే కొనసాగించాలని.. లేదంటే ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ కు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. అయితే దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పర్చూరు కార్యకర్తలతో చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి ఒకే పార్టీలో ఉండాలని, వైసీపీలోకి పురందేశ్వరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని.. పార్టీలో చేరితే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని జగన్ అభిప్రాయపడ్డారని బాలినేని వారితో అన్నట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్నీ దగ్గుబాటి చేరవేశారు కార్యకర్తలు. దాంతో దగ్గుబాటి దంపతులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వాస్తవానికి కుమారుడు హితేష్ చెంచురామ్ రాజకీయ భవిశ్యత్ కోసం దగ్గుబాటి వెంకటేశ్వరావు వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు పర్చూరు వైసీపీ టిక్కెట్ హితేష్ కు ఖరారు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన వెంకటేశ్వరావు పోటీ చెయ్యాల్సి వచ్చింది. అయితే ఎన్నికల అనంతరం దగ్గుబాటి జగన్ ను కలిసి తన కుమారుడికి పర్చూరు ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పాలని కోరారు. అయితే జగన్ ఈ ప్రతిపాదనకు ఒకే చెప్పలేదు. పురందేశ్వరిని కూడా వైసీపీలోకి రావాలని కండీషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ తతంగం జరుగుతున్న సమయంలోనే గతంలో పార్టీని వీడి తిరిగి వైసీపీలో చేరారు రావి రామనాధంబాబు. దీంతో దగ్గుబాటి వర్గంలో అలజడి మొదలయింది. ఎక్కడ రామనాధంబాబుని ఎక్కడ ఇంఛార్జిగా ప్రకటిస్తారో అన్న టెన్షన్ దగ్గుబాటి అనుచరుల్లో పెరిగిపోతోంది. ఇవేవి అర్ధం కాక వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories