Top
logo

నా జోలికి వస్తే విశాఖలో తిరగనివ్వను : మంత్రి అవంతి

నా జోలికి వస్తే విశాఖలో తిరగనివ్వను : మంత్రి అవంతి
Highlights

నా జోలికి వస్తే విశాఖలో తిరగనివ్వను : మంత్రి అవంతి నా జోలికి వస్తే విశాఖలో తిరగనివ్వను : మంత్రి అవంతి

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. తన జోలికి వస్తే విశాఖలో తిరగనివ్వనని అన్నారు. వైసీపీలో రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడం లేదని.. ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలో మాత్రం అవినీతిపరులకు, బ్యాంకులను మోసం చేసిన మోసగాళ్లకు జగన్ అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ గురించే మాట్లాడే అర్హత గంటాకు లేదన్నారు.. విజయనగరం టీడీపీ ఇంచార్జ్ గా ఉంటూ ఒక్క సీటును కూడా గెలిపించుకోలేకపోయారన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. ఇతర పార్టీల్లో ఆఫర్‌ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అవంతి విమర్శించారు.


లైవ్ టీవి


Share it
Top