రాజధాని మార్పు విషయంపై మంత్రి అవంతి ఏమన్నారంటే..

రాజధాని మార్పు విషయంపై మంత్రి అవంతి ఏమన్నారంటే..
x
Highlights

రాష్ట్ర రాజధానిని మారుస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్. ఇదంతా టీడీపీ అవినీతి బయటపడుతుందని ఆ...

రాష్ట్ర రాజధానిని మారుస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్. ఇదంతా టీడీపీ అవినీతి బయటపడుతుందని ఆ పార్టీ ఆడుతున్న నాటకమని కొట్టిపారేశారు. టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా రాజధాని, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాట్లల్లో వాస్తవం ఉందన్నారు. అయితే అమరావతి రాజధానిని మారుస్తున్నామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు అవంతి. అలాగే పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లోద్దని హైకోర్టు చెప్పలేదన్నారు. కేవలం హైడల్ ప్రాజెక్టుపై మాత్రమే తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories