Top
logo

పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం : విద్యాశాఖ మంత్రి

పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం : విద్యాశాఖ మంత్రి
Highlights

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఆంగ్ల మాద్యమం ద్వారా పేద, మధ్య తరగతి...

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఆంగ్ల మాద్యమం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరగనుందని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఒంగోలు క్యాంప్‌ కార్యాలయాన్ని మంత్రి సురేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సురేష్ మాట్లాడుతూ.. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థుల మీద ఆంగ్ల మాధ్యమం ఒకేసారి రుద్దకుండా దశలవారిగా ఆంగ్ల విద్యను అలవాటు చేస్తామని స్పష్టం చేశారు. దీనిద్వారా విద్యార్థి కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతాడని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య కోసం బడ్జెట్ లో పెద్ద పీట వేశారని.. వార్షిక బడ్జెట్లో దాదాపు 16 శాతం విద్యకే కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ నెల 14న ఒంగోలు నుంచే సీఎం జగన్‌ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనసముదాయాలు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Next Story