logo

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Highlights

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు

నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది . దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేజర్ల, ఆదూరుపల్లి, పుట్టుపల్లి, దాచూరు, కొల్లపనాయుడుపల్లిలలో భూప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దంతో దాదాపు 8 సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని హడలిపోయారు.

తెల్లవారుజాము వరకు ప్రకంపనలు కొనసాగినట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు. భూప్రకంపనలకు ఇళ్లల్లో అటకపైన ఉన్న వస్తువులు కిందపడిపోయినట్టు తెలిపారు. మంచాల మీద పడుకున్న వారు కూడా కిందకు పడిపోయినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు బాధిత గ్రామాల్లో పర్యటించారు. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో ఇలాంటివి సహజమని, ప్రజలు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.


లైవ్ టీవి


Share it
Top