విశాఖపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

విశాఖపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు రాజధానులు కొనసాగుతాయని చెప్పిన ప్రభుత్వం. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో మెట్రోరైలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు రాజధానులు కొనసాగుతాయని చెప్పిన ప్రభుత్వం. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో మెట్రోరైలు ప్రాజెక్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖకు మెట్రోకు డీపీఆర్‌ రూపకల్పన చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు అమ‌రావ‌తి మెట్రో రైల్ ఎండీకి డీపీఆర్‌ల త‌యారీకి కొటేష‌న్లు పిలవాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే గతంలో ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు డీపీఆర్‌ రూపకల్పన అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వం విశాఖలో 79.9 కి.మీ పరిధిలోని మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌కు కార్యాచరణ రూపొందిచనుంది. మూడు కారిడార్లలో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. 60 కి.మీ. మోడ్రన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. కాగా.. కొత్త డీపీఆర్‌ల‌ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్‌, రైట్స్‌, యూఎంటీసీ సంస్థలను సంప్రదించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories