నాగేంద్రకు ఉరిశిక్ష పడేలా చూస్తాం : హోంమంత్రి సుచరిత

నాగేంద్రకు ఉరిశిక్ష పడేలా చూస్తాం : హోంమంత్రి సుచరిత
x
Highlights

మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య ఘటనలో నిందితుడు నాగేంద్ర కోలుకోగానే ఛార్జ్ షీటు దాఖలు చేస్తామన్నారు.

మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య ఘటనలో నిందితుడు నాగేంద్ర కోలుకోగానే ఛార్జ్ షీటు దాఖలు చేస్తామన్నారు. నిందితుడిని దిశ చట్టంలో ఉన్న విధంగా ఉరిశిక్ష ఖరారు అయ్యేలా చేస్తామన్నారు. అటు దివ్య తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసారు. ఈ సందర్భంగా తమను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లిన రాష్ట్ర హోం మంత్రి సుచరితకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కు దివ్య విషయంతో జరిగింది వివరించామని, ముఖ్యమంత్రి పూర్తి విచారణ తర్వాత నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతే కాకుండా తమ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories