ఆన్‌లైన్‌లో ఆప్కో వస్త్రాలు : గౌతమ్‌రెడ్డి

ఆన్‌లైన్‌లో ఆప్కో వస్త్రాలు : గౌతమ్‌రెడ్డి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో), ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి...

ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో), ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించడం ద్వారా ఆప్కోకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని అన్నారు. ఇకపై ఆప్కో, అమెజాన్‌ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. అమెజాన్‌ సహాయంతో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ జరుగుతోందన్నారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయని మంత్రి తెలిపారు. ఇకపై జిఎస్టి అమ్మకందారుల నుండి మాత్రమే వసూలు చేస్తారని అన్నారు.

ఇంతకుముందు అమ్మకందారుడు ఆప్కో ఉత్పత్తులను క్రెడిట్ మీద విక్రయించేవాడు అయితే ఈ విధానం ద్వారా చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే వస్తువు పంపబడుతోందని అన్నారు. ఇకపై ఆప్కో ఉత్పత్తుల అమ్మకాలపై కమిషన్ 8 శాతానికి పరిమితం చేశామని.. అమెజాన్‌లోని ఇతర ఉత్పత్తులు 15 శాతం వసూలు చేస్తాయని అన్నారు. అమెజాన్‌లో ఆప్కో ఉత్పత్తులలో చీరలు, తువ్వాళ్లు, లుంగీలు, ధోతీస్, చున్నీస్ / దుపట్టాలు, దుస్తుల సామగ్రి, బెడ్‌షీట్లు, న్యాప్‌కిన్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories