దొనకొండపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

దొనకొండపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
x
దొనకొండపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
Highlights

ప్రకాశం జిల్లాలో దొనకొండ మళ్లి వార్తల్లోకి నిలిచింది. గతంలో దొనకొండ రాజధాని అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండపై కీలక నిర్ణయం తీసుకుంది. దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభత్వం కసరత్తు చేస్తున్నట్లుగా ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

లక్నోలో నిర్వహిస్తున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్ పో-2020లో మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దొనకొండ రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు అనువైన ప్రాంతమని తెలిపారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని చెప్పారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టుల ఎగుమతి, దిగుమతులను అవకాశాలు ఉన్నాయని అన్నారు. డిఫెన్స్ ఎక్స్ పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు.

గత ప్రభుత్వం పాలనలో దొనకొండ రాజధాని చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిఫెన్స్‌ క్లస్టర్ ఏర్పాటుకు, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమలకు కీలక ప్రాంతంగా ప్రభుత్వం భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories