ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం.. అందువల్లే సందిగ్ధత : మంత్రి గౌతంరెడ్డి

ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం.. అందువల్లే సందిగ్ధత : మంత్రి గౌతంరెడ్డి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ నుంచి రిలయన్స్, అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకొని వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ...

ఆంధ్రప్రదేశ్ నుంచి రిలయన్స్, అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకొని వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ఈ ప్రచారాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఖండించారు. పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి అనేక విధానాలుంటాయని అన్నారు. రిలయన్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గాను గత ప్రభుత్వం వివాదస్పదమైన భూములను రిలయన్స్‌ గ్రూపునకు కేటాయించిందని.. తమ ప్రభుత్వం ఆ భూమి కాకుండా ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములను ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని మంత్రి గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

గతంలో కేటాయించిన 136 ఎకరాల భూమిపై 15 మంది రైతులు కోర్టులో కేసులు దాఖలు చేయడంతో ఆ భూములను రిలయన్స్‌ వినియోగించుకోలేక పోతోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వివాదం లేని భూములను కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇదే విషయమై రిలయన్స్‌ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందన్నారు.. ఈ విషయాలను దృష్టిలోపెట్టుకొని అవాస్తవ కథనాలను ప్రచారం చేయవద్దని ప్రసార మాధ్యమాలను మంత్రి గౌతంరెడ్డి కోరారు.ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం.. అందువల్లే సందిగ్ధత : మంత్రి గౌతంరెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories