పోలవరంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ

పోలవరంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ
x
Highlights

పోలవరంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొందరు కార్మికులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు...

పోలవరంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొందరు కార్మికులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలవరంలో ఇప్పటివరకు చేసిన పనులకు గాను తమకు వేతనాలు చెల్లించాలని కోరుతు.. వారు ఆందోళన చేపట్టారు. పోలీసుల రక్షణతో పోలవరం వద్దకు చేరుకున్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు. భూమిపూజ చేసి పనులు ప్రారంభించింది మేఘా సంస్థ.

కాగా పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే.. నవయుగ సంస్థ పిటిషన్‌ మేరకు పోలవరం పనులపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ సదుద్దేశంతో నవయుగ పిటిషన్ దాఖలు చేయలేదని వాదించారు. అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పోలవరం పనులపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. దాంతో హైడల్ ప్రాజెక్టుకు ఇవాళ శంకుస్థాపన చేసింది. మరోవైపు పోలవరం హెడ్ వర్క్స్ పై కూడా నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories