ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం.. విశాఖ రాజధాని కోసం మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో భేటీ

Meeting of Uttarandhra JAC at Srikakulam
x

ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం.. విశాఖ రాజధాని కోసం మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో భేటీ 

Highlights

*ఇప్పటికే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన మంత్రి ధర్మాన

Srikakulam: శ్రీకాకుళంలో విశాఖ రాజధాని కోసం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జేఏసీ సమావేశమైంది. సమావేశానికి వ్యాపారవేత్తలు, మేధావులు, ఉద్యోగాల సంఘాల నాయకులు, ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ పట్నం పరిపాలన రాజధాని కావాలని నేతలు కోరుతున్నారు. జేఏసీ ఏర్పాటుతోపాటు అవసరమైతే తాను రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటానని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే ప్రకటించారు. దీపావళి మరుసటి రోజు నుండి ఉద్యమం ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశంలో అందరూ మాట్లాడిన తరువాత మంత్రి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories