పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ భేటీ

Meet the PRC Practice Steering Committee
x

పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ భేటీ

Highlights

PRC Meeting: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చలో విజయవాడ విజయవంతం చేసేందుకు చర్చలు.

PRC Meeting: రెవెన్యూ భవన్‌ దగ్గర పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ విజయవంతం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు, గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నా్యి. పీఆర్సీపై జీవో వచ్చాక ఏం చేయలేమంటున్న ప్రభుత్వ వైఖరిపై.. ఎలా ముందుకెళ్లాలని స్టీరింగ్ కమిటీ చర్చిస్తోంది. పే స్లిప్పులను తగులబెట్టి నిరసన తెలపాలని నిర్ణయించారు. హెచ్‌ఆర్ఏ పెంచి డీఏ తగ్గించడం.. ఐఆర్ పూర్తిగా తీసివేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories