ఏపీపీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారు..

ఏపీపీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయనకు...

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇవాళ సాయంత్రం లేదంటే రేపటిలోగా అధికారిక ఉత్తర్వులు రానున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లేందుకు కిరణ్ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా రాష్ట్ర పదవుల విషయంలో నిర్ణయాన్ని కిరణ్ కే వదిలేసినట్టు తెలుస్తోంది. కిరణ్ కాదంటే పల్లంరాజును ఆప్షన్ గా పెట్టుకుంది కాంగ్రెస్. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజీనామా తర్వాత ఇప్పటి వరకు ఏపీకి నూతన పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయలేదు. దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళనలో పడిన కాంగ్రెస్.. ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని దాదాపుగా ఫైనల్ చేసింది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా కిరణ్ పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడింది. దాంతో గతేడాదే తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంది. అయితే ఆయన సుముఖంగా లేకపోవడంతో రఘువీరానే కంటిన్యూ చేసింది. ఈ క్రమంలో రఘువీరా రాజీనామా చేయడంతో ఎంపిక అనివార్యమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories