Municipal Transfers : ఏపీ మున్సిపల్ శాఖలో భారీ బదిలీలు.. పలువురు కమిషనర్లు అటు ఇటు

ఏపీ మున్సిపల్ శాఖలో భారీ బదిలీలు.. పలువురు కమిషనర్లు అటు ఇటు

CR Reddy
Published on: 7 Feb 2026 7:16 AM IST
Municipal Transfers : ఏపీ మున్సిపల్ శాఖలో భారీ బదిలీలు.. పలువురు కమిషనర్లు అటు ఇటు
X

Municipal Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల ప్రక్రియ చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనలో వేగం పెంచడానికి, కీలక విభాగాలను బలోపేతం చేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పలు ప్రధాన నగరాలు, పట్టణాలకు కొత్త కమిషనర్లు రావడంతో అక్కడి పాలనలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో జరిగిన ఈ తాజా బదిలీల్లో భాగంగా అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం.జస్వంత్ రావును నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పనిచేసిన బి.బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ (UDA)లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జి.సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న టి.వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏకు సెక్రటరీగా పంపిస్తూ పరస్పర బదిలీలు చేపట్టారు.

మరికొన్ని పట్టణాల్లోనూ కీలక మార్పులు జరిగాయి. గుంతకల్ కమిషనర్‌గా ఉన్న సీఎంఏ నయీం అహ్మద్‌ను ఆదోనికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆదోనిలో ఉన్న కృష్ణను అమరావతిలోని సీఆర్‌డీఏ (CRDA)కు పంపించారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ (UDA) కార్యదర్శిగా వెయిటింగ్‌లో ఉన్న పి.సింహాచలంకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌.చండి దేవసేనను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

కేవలం కమిషనర్లే కాకుండా, కింది స్థాయి అధికారులకు కూడా పదోన్నతులు, బదిలీలు లభించాయి. విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.శివరామ్‌ప్రసాద్‌ను వినుకొండ మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతిపై పంపించారు. అక్కడ పనిచేస్తున్న ఎం.సుభాష్ చంద్రబోస్‌ను సీడీఎంఏ కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచించారు. ఇక కల్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా ఉన్న ఎస్‌.నూర్‌ అలీఖాన్‌ను కమలాపురం నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించగా, అక్కడ ఉన్న ప్రహ్లాద్‌ను సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

Next Story