కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిన్నమండెం మండలంలోని కేశాపురం వద్ద జరిగింది. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న కారు కేశాపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా మృతులు కడపకు చెందిన హర్షవర్ధన్, బుజ్జి, భూదేవిగా గుర్తించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికే అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories