Top
logo

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
Highlights

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగుళూరు హైవే గుండా వెళుతున్న కారు గంగవరం మండలం మామడుగు దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో మంటలు చెలరేగడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న విష్ణు... తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లి.. ఆమె కూతురుతో బెంగళూరు నుంచి పలమనేరుకు వెళ్తున్నారు. గంగవరం మండలం మామడుగు వద్దకు రాగానే కారు అదుపు తప్పింది.. రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో విష్ణు తీవంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విష్ణును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story

లైవ్ టీవి


Share it