ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..

ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..
x
Highlights

మార్కాపురం నియోజకవర్గం.. సాధారణంగా ఒకరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటారు, లేదంటే రాజధానిలో ఉంటారు. కానీ ఈ...

మార్కాపురం నియోజకవర్గం.. సాధారణంగా ఒకరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటారు, లేదంటే రాజధానిలో ఉంటారు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు బిన్నంగా జరుగుతోంది. ఇక్కడ ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి నివాసం ఉంటున్నారు. మార్కాపురం కేంద్రంగా యర్రగొండపాలెం, గిద్దలూరు రాజకీయాలు జరుగుతుంటాయి.

యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యా వనరుల శాఖ మంత్రి ఆదిమాలపు సురేష్ ఆయన నివాసం మార్కాపురంలోనే ఉంది. అయితే ఆయన మంత్రి హోదాలో ఉన్నా.. ఉంటే విజయవాడ, లేదంటే మార్కాపురంలో ఉంటారట. వారంలో కచ్చితంగా నాలుగుసార్లు యర్రగొండపాలెం వెళ్లి వస్తుంటారట. గతకొంత కాలంగా మంత్రి సురేష్ మార్కాపురం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ బలంగా వినబడుతోంది. అటు గిద్దలూరుకు చెందిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మార్కాపురంలోనే నివాసం ఉంటున్నారు. ఆయన కూడా వారానికి నాలుగు సార్లు గిద్దలూరు వెళ్లి వస్తుంటారట. ఆయనకు చెందిన విద్యాసంస్థలు, వ్యాపార లావాదేవీలు అన్ని మార్కాపురం కేంద్రంగానే సాగుతున్నాయి.

ఇక మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి మాత్రం ఎలాగో ఇక్కడే ఉంటారు.. కాబట్టి పెద్దగా సమస్య ఏమి లేదు. మంత్రి ఆదిమాలపు సురేష్ నివాసం, నాగార్జునరెడ్డి నివాసం పక్కపక్కనే ఉంటాయి. అయితే గిద్దలూరు, యర్రగొండపాలెం ఎమ్మెల్యేల నివాసం మార్కాపురంలోనే ఉండటం మూలాన నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఎమ్మెల్యేను కలవాలంటే దాదాపు 50 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయాల్సి వస్తోందని అంటున్నారు. దాంతో సమయం వృధా అవుతోంది అన్న ఫీలింగ్ కొందరిలో కనిపిస్తోంది.

పేరుకు ఆయా నియోజకవర్గాల్లో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నా.. అనుకున్నంత మేర ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని అభిప్రాయపడుతున్నారట. కార్యకర్తలు అంటే ఎలాగో అడ్జెస్ట్ అవుతారు కానీ.. ప్రజలు అలా ఉంటారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా రాజకీయం 2009 నుంచే జరుగుతున్నా ప్రజలు మాత్రం దీన్ని లైట్ గా తీసుకున్నారు. ఏదైతేనేం తమకు పనులు చేసిపెట్టడం ముఖ్యమని సరిపెట్టుకుంటున్నారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories