logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏవోబీలో రెచ్చిపోయిన మావోయిస్టులు

maoist blast
X

ఏవోబీలో రెచ్చిపోయిన మావోయిస్టులు( ఫైల్ ఫోటో )

Highlights

Andhra Pradesh: భద్రతా బలగాలే టార్గెట్‌గా ల్యాండ్‌మైన్‌ మావోయిస్టులు పేల్చారు.

Andhra Pradesh: ఏవోబీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా ల్యాండ్‌ మైన్‌ పేల్చారు. ఈ ఘటనలో 160 BSF బెటాలియన్‌కు చెందిన ధర్మేంద్ర సాహుకు తీవ్రగాయాలు కాగా.. అతడిని హుటాహుటిన హెలికాప్టర్‌లో రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పీఎస్‌ పరిధిలోని దాల్‌దాలీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో కూంబింగ్‌ నిర్వహించారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. ఇక.. అదే సమయంలో మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ పేల్చి.. కాల్పులకు తెగపడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు.. మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అక్కడి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్నారు భద్రతాదళాలు.


Web TitleMaoist blast in at Visakhapatnam district In Andhra Pradesh
Next Story