వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం
x
Highlights

మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది..

మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి (87) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దశరథరామిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. కాగా దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు,

మరో కుమారుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్దిరోజులు రాజకీయంగా దూరంగా ఉన్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభం కాగానే మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. ఇక రామకృష్ణారెడ్డి 2014 సాధారణ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ ను ఓడించి రికార్డు సృష్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories