మంగళగిరిలో గెలుపెవరిది?

మంగళగిరిలో గెలుపెవరిది?
x
Highlights

ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోకి మంగళగిరి నియోజకవర్గం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచే స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్...

ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోకి మంగళగిరి నియోజకవర్గం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచే స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పోటీ చేసేసరికి అందరి కళ్లు ఇప్పుడు ఈ నియోజకవర్గంపై పడ్డాయి. సర్వేలు కూడా ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో తేల్చలేకపోతున్నాయి. అంత సస్పెన్స్ గా పరిస్థితి ఉంది మంగళగిరిలో. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ - వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జనసేన మద్దతులో సీపీఐ అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు బరిలోకి దిగారు. పొత్తుల్లో భాగంగా మంగళగిరి సీటు సీపీఐకి ఇచ్చింది జనసేన. ఇక్కడ నుంచి సీపీఐ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ముప్పాళ్లకు ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఆసక్తికర విషయమే. పోటీలో ఎంతమంది ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం ఆర్కే నారా లోకేష్ మధ్యే కనబడుతోంది.

ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రిగా నారా లోకేష్ సుపరిచితం. ఐటీ మంత్రిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్. విదేశాలకు వెళ్లి ఏపీకి పెట్టుబడులను తేవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తండ్రి చంద్రబాబు తరువాత తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. సీఆర్ డీఏ పరిథిలోని రాజధాని ప్రాంతం ప్రధానంగా ఎక్కువ భాగం మంగళగిరిలోనే ఉంది. విజయవాడ గుంటూరు - విజయవాడ తెనాలి మధ్య రాకపోకలను మంగళగిరి ప్రధానం. దీనికి తోడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా ఇదే నియోజకవర్గం కిందకు వస్తారు. వాళ్ల ఓట్లన్నీ లోకేష్ కు పడితే.. టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఇక వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. రాజన్న క్యాంటీన్, 10 రూపాయలకే కూరగాయలు వంటి సొంత పథకాలతో పేదప్రజలకు చేరువయ్యారు.

అంతేకాదు అత్యంత సామాన్యుడిగా.. పొలం పనులు చేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. సదావర్తి, రాజధాని భూముల కేసులో టీడీపీకి చుక్కలు చూపించారు ఆర్కే. దీంతో.. ఆర్కే ఇమేజ్ మంగళగిరిలో బాగా పెరిగింది. మరోవైపు.. కాజ - పెనుమాక లాంటి గ్రామాల్లో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా చేనేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆయన టీడీపీలో ఉండటం లోకేష్ కు కలిసి వచ్చే అంశం కాగా.. టీడీపీలోని కొందరు నేతలతోపాటు చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరి మంగళగిరిలో గెలుపెవరిదో మీరు పోల్ ద్వారా తెలియజేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories