ఏపీ సీఎం జగన్‌కు మందకృష్ణ సవాల్‌

ఏపీ సీఎం జగన్‌కు మందకృష్ణ సవాల్‌
x
Highlights

ఏపీ సీఎం జగన్‌కు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సవాల్‌ విసిరారు ఆర్థిక నేరస్తులపై నమోదైన కేసులను త్వరగా విచారించి కఠినంగా...

ఏపీ సీఎం జగన్‌కు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సవాల్‌ విసిరారు ఆర్థిక నేరస్తులపై నమోదైన కేసులను త్వరగా విచారించి కఠినంగా శిక్షించేందుకు చట్టం చేయగలరా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ఈ సందర్బంగా కొత్తగా చేసిన దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌లో 2017లో సుగాలి ప్రీతిబాయ్‌ ని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి , హర్షారెడ్డి లకు దిశ చట్టం ప్రకారం ఉరిశిక్ష వేస్తారా? ఎన్‌కౌంటర్‌ చేస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు దిశ చట్టాన్ని చేసిన కొద్దీ రోజులకే 5 ఏళ్ల బాలికపై లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశాడని.. అతన్ని ఎన్‌కౌంటర్‌ చేయగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం హాజీపూర్ లో ముగ్గురిని అత్యాచారం చేసి చంపి బావిలో పడేసిన శ్రీనివాసరెడ్డిని, మరో బాలికను అత్యాచారం చేసిన నవీన్‌రెడ్డి అనే వ్యక్తులను కూడా ఎన్‌కౌంటర్‌ చేయించగలరా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు మంద కృష్ణ

.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories