కాపురంలో చిచ్చుపెట్టిన కరోనా అనుమానం.. భార్యను పుట్టింటికి తరిమేసిన భర్త

కాపురంలో చిచ్చుపెట్టిన కరోనా అనుమానం.. భార్యను పుట్టింటికి తరిమేసిన భర్త
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అందర్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోనన్న భయం అందర్ని వెంటాడుతోంది. కొందరు మాత్రం అతిగా ఊహించేసుకుని అతి...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అందర్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోనన్న భయం అందర్ని వెంటాడుతోంది. కొందరు మాత్రం అతిగా ఊహించేసుకుని అతి భయంతో కుటుంబ సభ్యుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు చుట్టు పక్కల జనాల మాటలు విని, అపోహలతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వైరస్‌పై గ్రామస్థుల మాటలు విన్న ఓ ఇంటి పెద్ద కట్టుకున్న భార్య, ఎనిమిదేళ్ల కొడుకుపై కటువుగా ప్రవర్తించాడు. ఈ సంఘటన చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి (కొండరెడ్ల) గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతులకు మూడో తరగతి చదువుతున్న కొడుకు సంజీవరెడ్డి ఉన్నాడు. కాగా సంజీవరెడ్డి నాలుగు రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసినా తండ్రి రాజారెడ్డి కొడుకుకు కరోనా వైరస్ సోకిందని భావించాడు. భార్యను కొట్టి.. కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇద్దర్ని ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. ఈ ఘటనతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై బాలుడికి పరీక్షలు జరిపించగా కేవలం జ్వరం మాత్రమే ఉందని తేల్చారు. దీంతో స్థానికులతో మాట్లాడి, రాజారెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories