అనుమానం పెనుభూతం.. భార్యపై దాడి.. కన్నకొడుకు హత్య..

అనుమానం పెనుభూతం.. భార్యపై దాడి.. కన్నకొడుకు హత్య..
x
Highlights

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యపై దాడి చేసి.. ఆపై 8 నెలల కన్నకొడుకుపై దాడి చేశాడు. దీంతో చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన ప్రకాశం...

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యపై దాడి చేసి.. ఆపై 8 నెలల కన్నకొడుకుపై దాడి చేశాడు. దీంతో చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో జరిగింది. చిన్నపుల్లయ్య మొదటగా లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెపై అనుమానంతో హత్య చేశాడు. ఈ కేసులో 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం రాచర్లకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.. అయినా అతని బుద్ధి మారలేదు.. రెండో భార్యను గత కొంతకాలంగా అనుమానంతో వేధిస్తున్నాడు.

ఆ అనుమానం పెనుభూతమైంది. ఈ నేపథ్యంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు.. రోకలి బండతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఆ తరువాత కన్నకొడుకును నేలకేసి కొట్టి చంపాడు. తీవ్ర గాయాలైన భార్యను బంధువులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు గిద్దలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పుల్లయ్య పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories