మహిళపై పలుమార్లు అత్యచారానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు గుంజాడు.. చివరకు..

మహిళపై పలుమార్లు అత్యచారానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు గుంజాడు.. చివరకు..
x
Highlights

మహిళపై దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆమెను అత్యాచారం చేయడం కాకుండా బెదిరింపులకు గురిచేసి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాడు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది....

మహిళపై దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆమెను అత్యాచారం చేయడం కాకుండా బెదిరింపులకు గురిచేసి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాడు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం. విశాఖపట్నంలో గవర్నమెంటు ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. ఆమెకు మత్తు పదార్ధాలు ఇచ్చి అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం పాల్పడ్డాడు. అంతేకాదు నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి పెద్దఎత్తున డబ్బులు కూడా తీసుకున్నాడు.

భయాందోళనకు గురైన బాధితురాలు.. అతనికి దాదాపు రూ .50 లక్షలు వరకు ఇచ్చింది, అయినా కూడా ఇంకా డబ్బు కావాలని ఆమె హింసించడం కొనసాగించాడు. అతని తల్లిదండ్రులు కూడా అతనికి మద్దతు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా, ఆ వ్యక్తి తన స్నేహితుడికి కూడా ఆ ఫోటోలను పంపించాడు. అతను ఆమెను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి బాధలు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని, అతని తల్లిదండ్రులను, స్నేహితుడిని అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories