విషాన్ని పాయసంలా.. బ్రతికున్న పామును పకోడీలా నమిలేస్తున్నాడు..

విషాన్ని పాయసంలా.. బ్రతికున్న పామును పకోడీలా నమిలేస్తున్నాడు..
x
Highlights

విషాన్ని పాయసంలా.. బ్రతికున్న పామును పకోడీలా నమిలేస్తున్నాడు.. విషాన్ని పాయసంలా.. బ్రతికున్న పామును పకోడీలా నమిలేస్తున్నాడు..

పాము మాటెత్తితే చాలు ఒళ్లు జలదరిస్తుంది. చూసినా చూడకున్నా.. పామంటేనే భయంతో వణికిపోతుంటాం.. అలాంటిది పాము కనిపిస్తే చాలు పకోడీలు నమిలినట్టు నమిలిపారేస్తున్నాడు ఈ వ్యక్తి.. అతనికి పాము విషమంటే పాయసంతో సమానం అన్నట్టు.. పాము విషాన్ని అమాంతం తాగేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు.. తిరుమలేశుడి పేరు పెట్టుకున్నా చేసే పనులు మాత్రం శివుణ్ణి తలపిస్తున్నాయి. పాము కనబడితే చాలు మోకాళ్ళ మీద పాకుతూ.. పట్టుకొని మేడలో వేసుకుంటాడు.. అంతటితో ఆగకుండా దాని విషం పాయసంలా తాగేస్తాడు. వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా పాములు పట్టేవాడు. దీంతో చిన్నప్పటినుంచి పాములతో ఆడుకోవడం అలవాటైంది. ఈ క్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరి ఇంట్లో పాము దూరినా అతనికే కబురు చేస్తుంటారు. ఎంతటి భయంకర పామునైనా పట్టుకొని దాని విషాన్ని రుచిచూడటం అతని స్టైల్.. పాము కనిపించడం ఆలస్యం పండగ చేసుకుంటాడు వెంకటేశ్వర్లు.. నాగుపామును సైతం ఆటాడుకుంటాడు.

ఒకవేళ అతనికి కోపం తెప్పిస్తే మాత్రం దాన్ని కరకర నమిలి తింటాడు. ఈ విచిత్రమైన వ్యక్తిని స్థానికంగా పున్నమినాగు అని పిలుచుకుంటారు. పాముకు తలలో, తేలుకి తోకలో విషం ఉంటుందని అంటారు. అయితే చిన్ననాటినుంచి విషాన్ని సేవిస్తుండటంతో అతని శరీరం మొత్తం విషంలా మారిందని.. అందుకే ఇతడు దేన్నీ కరిచినా అది కాటికిపోవడం ఖాయం.. తాను కోడిని కరిస్తే ఒక అరగంటలోనే అది మరణిస్తుందని చెబుతాడు వెంకటేశ్వర్లు. అయితే తన భర్తకు ఈ అలవాటు ఉన్నా పెళ్లిచేసుకున్నానని అంటోంది ఆయన భార్య ఈశ్వరమ్మ.. ఇప్పటివరకు ఏమి కాలేదని తమ కుటుంబం సంతోషంగా ఉందని చెబుతున్నారు. తాము కూడా అతనితో బాగానే ఉంటామని.. సాధారణ మనిషిగానే చూస్తామని గ్రామస్థులు అంటున్నారు. అతని వలన జంతువులు సైతం చనిపోతాయని తెలిసినా స్నేహం చేస్తున్నామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories