నరసరావుపేటలో పెళ్లి పేరుతో ఘరానా మోసం

Man Cheats Women in The Name Of Marriage
x

నరసరావుపేటలో పెళ్లి పేరుతో ఘరానా మోసం

Highlights

Narasaraopeta: మ్యాట్రిమోనిలో వేరొకరి ఫొటో పెట్టిన పొట్లూరి వంశీకృష్ణ

Narasaraopeta: పల్నాడు జిల్లాలో పెళ్లి పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన ఓ కేటుగాడు తన ఫోటోకు బదులుగా, ఫేక్ ఫోటోను క్రియేట్ చేసి.. నరసరావుపేటకు చెందిన యువతిని మోసం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన పొట్లూరి వంశీ కృష్ణ.. మ్యాట్రిమోనిలో కొచేర్ల శ్రీకాంత్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. ఈ ఫేక్ ఐడీతోనే నరసరావుపేటకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నానని.. భారీగా శాలరీ డ్రా చేస్తున్నానని మాయ మాటలు చెప్పాడు. విదేశాలకు వెళ్లడానికి డబ్బు అవసరమని నమ్మించి.. వీసా కోసం యువతి నుంచి 48లక్షలకు పైగా వసూలు చేశాడు. అసలు విషయం తెలియడంతో నిందితుడు వంశీకృష్ణపై.. ఆ యువతి నరసరావుపేట వన్ టౌన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories