పశ్చిమలో ప్రేమోన్మాది

పశ్చిమలో ప్రేమోన్మాది
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా పొడూరు మండలంలో దారుణం జరిగింది. కవిటం గ్రామానికి చెందిన డిప్లమో విద్యార్ధినిపై సుధాకర్ రెడ్డి అనే ప్రేమోన్మాది కత్తితో దాడికి...

పశ్చిమ గోదావరి జిల్లా పొడూరు మండలంలో దారుణం జరిగింది. కవిటం గ్రామానికి చెందిన డిప్లమో విద్యార్ధినిపై సుధాకర్ రెడ్డి అనే ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇప్పటికే పెళ్లి అయిన సుధాకర్ రెడ్డి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విద్యార్ధిని వెంటపడుతున్నాడు. సుధాకర్ రెడ్డి ప్రేమను తిరస్కరించిన విద్యార్ధిని తన వెంట పడవద్దంటూ కొద్ది రోజుల వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన సుధాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం పథకం ప్రకారం కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. దాడి చేసిన అనంతరం సుధాకర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్ధిని పరిస్ధితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories