logo

నేడు టీడీపీ ప్రచారానికి మమత, కేజ్రీవాల్‌

నేడు టీడీపీ ప్రచారానికి మమత, కేజ్రీవాల్‌
Highlights

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారానికి ఇవాళ(ఆదివారం) జాతీయ నేతలు ఏపీకి రానున్నారు. విశాఖలో ఆదివారం టీడీపీ...

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారానికి ఇవాళ(ఆదివారం) జాతీయ నేతలు ఏపీకి రానున్నారు. విశాఖలో ఆదివారం టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబుతోపాటు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌ పాల్గొననున్నారు. విశాఖ వన్‌టౌన్‌ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించే సభలో వీరంతా పాల్గొంటారు. కాగా ఇదివరకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మైలవరంలో, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కడపలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.


లైవ్ టీవి


Share it
Top