మన టైం వచ్చింది : యాత్ర డైరెక్టర్

మన టైం వచ్చింది : యాత్ర డైరెక్టర్
x
Highlights

'యాత్ర' సినిమాతో భారీ విజయం సాధించిన మహి వి రాఘవ ప్రస్తుతం మరో చిత్రం పనిలో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా రాజకీయాలను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు రాఘవ....

'యాత్ర' సినిమాతో భారీ విజయం సాధించిన మహి వి రాఘవ ప్రస్తుతం మరో చిత్రం పనిలో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా రాజకీయాలను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు రాఘవ. ప్రస్త్తుతం ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ సందర్బంగా మహి వి రాఘవ ఓ వీడియోను తన పేస్ బుక్ లో షేర్ చేశారు.

ఆ వీడియోలో వైసీపీ ప్రకటించిన నవరత్నాలు, వైసీపీ అధికారంలోకి ఏమి చేస్తామన్నది పలు సమయాల్లో జగన్ చెప్పిన మాటలను అన్నింటిని కలిపి వీడియో మేకింగ్ చేసి పేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ వీడియోకు 'అప్నా టైం ఆయేగా' (మన టైం వచ్చింది) అని క్యాప్సన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories